- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాల్‌న్యూట్రిషన్ నిర్మూలనకు అలుపెరగని సేవలు..
దిశ, ఫీచర్స్ : భారత్‌లోని మెజారిటీ పిల్లల ఆరోగ్యాన్ని ఎదుగుదల లోపం ఏవిధంగా ప్రభావం చేస్తుందో గతేడాది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS 5) ఫలితాలు వివరించాయి. ఇదేగాక అనేక కమ్యూనిటీల్లోని తల్లుల్లో రక్తహీనత సమస్యలు అధికమయ్యాయి. 116 దేశాలకు సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (2021) ప్రకారం ఇండియా ర్యాంక్ 101కి పడిపోయింది. పాండమిక్ తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రతరమైంది. పోషకాహారానికి యాక్సెసబిలిటీ, అవగాహన, లభ్యత, కొనుగోలు స్థోమత లేకపోవడమే కారణం. ఈ నేపథ్యంలో తర్వాతి తరం ఆరోగ్యం, ఉత్పాదకత పెంచడంలో ప్రస్తుత తల్లులు, శిశువులు, పిల్లల శ్రేయస్సు మెరుగుపరచడమే కీలకం. కాగా దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలు, వారి తల్లుల్లో మాల్‌న్యూట్రిషన్ సమస్య పరిష్కరించేందుకు లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ 'విటమిన్ ఏంజెల్స్ ఇండియా(VA)' పనిచేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..
ప్రాణాలను రక్షించే సూక్ష్మ-పోషక సప్లిమెంటేషన్, నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతో పాటు కమ్యూనిటీ లెవెల్‌లో అవేర్‌నెస్ కల్పించేందుకు VA పని చేస్తోంది. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలహీనమైన, పోషకాహారానికి దూరమైన కమ్యూనిటీలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విటమిన్ ఏంజెల్స్ ఇండియా ప్రెసిడెంట్ సునీష్ జౌహరి వెల్లడించారు.
కాల్ టు యాక్షన్ :
పోషకాహార-నిర్దిష్ట జోక్యాలు(ఆహార వైవిధ్యం, సూక్ష్మపోషక సప్లిమెంటేషన్, ప్రత్యేకమైన తల్లిపాలు, చైల్డ్‌హుడ్ ఇన్‌ఫెక్షన్స్‌కు చికిత్స).. తల్లీ పిల్లల ఆరోగ్యం, వారి శ్రేయస్సు కోసం తక్షణ నిర్ణయాలను సూచిస్తాయి. ఇక గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లలకు సరిపడా పోషకాహారం అవసరం కాగా.. ఇది సంతానంలో తక్షణ, దీర్ఘకాలిక పెరుగుదల, అభివృద్ధి సహా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన ప్రసూతి పోషకాహారం.. మెటర్నల్ ఎనీమియా, పూర్ ప్రెగ్నెన్సీ ప్రమాదాలను తగ్గిస్తుంది. ఈ మేరకు ఇండియాలో దశాబ్దానికి పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న VA.. లైఫ్ సేవింగ్ ఎవిడెన్స్-బేస్డ్ సప్లిమెంట్స్‌తో 22 మిలియన్‌కు పైగా గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పాటు ఐదేళ్ల లోపు పిల్లలకు సేవలందించింది. ఇందుకోసం భారత్‌లోని డాక్టర్లు, సీనియర్ విశ్లేషకులతో కూడిన 20 మంది సభ్యుల బృందాన్ని కలిగి ఉన్నట్లు VA పేర్కొంది. ఈ సప్లిమెంట్లను విజయవంతంగా సరఫరా చేసేందుకు ఇప్పటి వరకు 20,000 కంటే ఎక్కువ మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, సర్వీస్ ప్రొవైడర్లకు సాంకేతిక శిక్షణను నిర్వహించింది.
వర్కింగ్ పాన్-ఇండియా:
'భారతదేశంలోని రిమోట్ ఏరియాలు, సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన సమూహాలకు పోషకాహార పంపిణీని వేగవంతం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతునిచ్చే భాగస్వామ్యాలను నిర్మించడంపై VA దృష్టిసారించింది. నిర్దిష్ట భౌగోళిక పరిస్థితుల్లో సవాళ్లను పరిష్కరించడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధుల రూపంలో పలు సంస్థల నుంచి గ్రాంట్స్ అందుకుంది. విటమిన్ ఏ సప్లిమెంటేషన్(VAS) తక్కువగా ఉన్న బుల్దానా, నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, నాగ్‌పూర్, ధూలే, పర్బని జిల్లాలకు పోషకాహార మద్దతును అందించేందుకు మహారాష్ట్రలోని 'ఓమ్నియాక్టివ్ హెల్త్ టెక్నాలజీస్'తో టైఅప్ అయింది. అంతేకాదు దేశంలో బాల్య అంధత్వానికి ప్రధాన కారణమైన 'విటమిన్ ఏ' లోపాన్ని అధిగమించేందుకు నిధుల సేకరణ కోసం గతేడాది 'దానోత్సవ్' సందర్భంగా గివ్‌ఇండియాతో భాగస్వామ్యం చేసుకుంది. ఇక పాండమిక్ ప్రారంభంలో VA.. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ NGOలు, ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. అనేక కమ్యూనిటీల్లో గర్భిణులకు మల్టిపుల్ మైక్రో న్యూట్రియెంట్ సప్లిమెంట్స్(MMS), ఐదేళ్లలోపు పిల్లలకు VAS, డైవర్మింగ్ మాత్రలు సహా క్లిష్టమైన EBNIలకు అంతరాయం లేకుండా యాక్సెస్ ఉండేలా చూసుకుంది. 2020లో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఐదేళ్లలోపు 6.4 మిలియన్ పిల్లలకు 'విటమిన్ ఏ', ఐదేళ్లలోపు 193,000 మంది పిల్లలకు అల్బెండజోల్ సరఫరాతో పాటు 78,000 మంది గర్భిణులను ఎంఎంఎస్‌తో చేరుకుని సేవలు అందించినట్లు విటమిన్ ఏంజెల్స్ ఇండియా తెలిపింది.
ఇంపాక్ట్ అండ్ చేంజ్:
విటమిన్ ఏంజెల్ ద్వారా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రాల్లో నాగాలాండ్ ఒకటి. 2005-06లో అక్కడ ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్ ఏ సప్లిమెంటేషన్(VAS) 6.6 శాతం మాత్రమే. దీంతో 2011లో స్థానిక పౌర సమాజం, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో తన జోక్యాన్ని ప్రారంభించింది VA. 2016 నాటికి ఇది నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంతో పార్ట్‌నర్‌షిప్ ఏర్పరచుకుంది. కాగా 2018లో సంస్థ నిర్వహించిన కవరేజ్ ఎవాల్యుయేషన్ సర్వేలో VAS కవరేజీ 72 శాతానికి మెరుగుపడిందని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయి కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఇక 2021లో నాగాలాండ్ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, మరణాల సమస్యలను పరిష్కరించేందుకు విటమిన్ ఏంజెల్స్‌తో తన భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించింది.
విటమిన్ ఏంజెల్స్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలతో టైఅప్ అవుతూ, అలాగే స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యంలో పని చేసింది. ఇది ప్రస్తుతం మహారాష్ట్ర, జమ్ము & కశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మిజోరం, మణిపూర్, పుదుచ్చేరి సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. మొత్తం మీద ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, 1,400+ NGOలు, విశ్వాస ఆధారిత సంస్థలతో కూడిన 1,800 భాగస్వామ్య సంస్థలతో పని చేస్తోంది.