'దమ్కీ' ఇస్తానంటున్న విశ్వక్ సేన్.. న్యూ ప్రాజెక్ట్ షురూ

by Harish |
దమ్కీ ఇస్తానంటున్న విశ్వక్ సేన్.. న్యూ ప్రాజెక్ట్ షురూ
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న 'అశోకవనంలో అర్జునకళ్యాణం' సినిమా రిలీజ్ అవకముందే తాజాగా మరో మూవీ 'ధమ్కీ'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వాన్మయి క్రియేషన్స్, vsసినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. 'పాగల్' సినిమాకు దర్శకత్వం వహించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన నివేద పెతురాజ్ ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

Advertisement

Next Story