Virender Sehwag: కెప్టెన్సీ నుండి రోహిత్ శర్మను తప్పించండి: సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2022-06-27 12:35:00.0  )
Virender Sehwag Says, Rohit Sharma Can be Relieved from T20 Captaincy
X

దిశ, వెబ్‌డెస్క్: Virender Sehwag Says, Rohit Sharma Can be Relieved from T20 Captaincy| టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. టీ20 కెప్టెన్సీ నుండి ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి.. అతడికి పనిభారం తగ్గించాలని పేర్కొన్నాడు. 35 ఏళ్ల రోహిత్‌ను టీ20 కెప్టెన్సీ నుండి తప్పిస్తే.. అతడు మరింత మెరుగ్గా వన్డే, టెస్టులపై దృష్టి సారిస్తాడని బీసీసీఐకి సూచించాడు. టీమిండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాయాల కారణంతో హిట్‌మ్యాన్ అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. రోహిత్ వయస్సును దృష్టిలో పెట్టుకుని అతడిని టీ20 కెప్టెన్సీ నుండి రిలీవ్ చేయడం వల్ల అతడు ఉపశమనం పొందడంతో పాటు, మిగిలిన ఫార్మాట్లపై మరింత ఫోకస్ చేసే అవకావం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. దీని వల్ల అతడు వన్డే, టెస్ట్ జట్టులను మరింత ముందుకు నడిపిస్తాడని సెహ్వాగ్ అన్నాడు. ఇక టీమిండియా అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే.. దానికి రోహిత్ అర్హుడు అని పేర్కొన్నాడు.

ఇక, ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు, స్టోక్స్ సేనతో రీ షెడ్యూల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ రావడంతో జూలై 1వ తేదీ నుండి ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్‌కు దూరం కానున్నాడు.

Advertisement

Next Story