- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RCB టైటిల్ గెలిచినా.. నాకు ఆ బాధ ఉంటుంది: కోహ్లీ
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కోహ్లీ మాట్లాడుతూ.. రాబోయే సీజన్లలో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తే.. ఆ విజయం కంటే ఎక్కువగా డివిలియర్స్ గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతానని అన్నాడు. అంతే కాకుండా డివిలియర్స్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని ప్రశంసలు కురిపించాడు.
కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన డివిలియర్స్ తన మిత్రునికి ఐపీఎల్ టైటిల్ అందించడానికి ఎంతో కృషి చేశాడు. కానీ, వీరికి ఆ అదృష్టం దక్కలేదు. ఐపీఎల్ కెరిర్‌లో టైటిల్ ముద్దాడకుండానే ఏబీ.. క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, 2011 నుంచి ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుపున ఆడుతున్న ఏబీ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎన్నోసార్లు జట్టును ఆపద సమయాల్లో ఆదుకున్నాడు. ఒంటి చేత్తో జట్టును చాలా సార్లు విజయతీరాలకు చేర్చాడు. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న ఏబీ.. తన ఆటతో ఇండియాలో కూడా చాలా మందిని అభిమానులను సంపాదించుకున్నాడు. డివిలియర్స్.. 2021 నవంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే.