తాటిచెట్లెక్కిన త‌డి పొడి చెత్త డ‌బ్బాలు..

by Satheesh |
తాటిచెట్లెక్కిన త‌డి పొడి చెత్త డ‌బ్బాలు..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: త‌డి పొడి చెత్త సేక‌ర‌ణ‌పై గ్రామీణ ప్రజ‌ల్లో స‌రైన అవ‌గాహ‌నక‌ల్పించ‌క‌పోవ‌డంతో అబాసుపాల‌వుతోంది. పంపిణీ చేసిన డ‌బ్బాల‌ను ప్రజ‌లు ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి స‌మీప గ్రామంలో గీత కార్మికులు మ‌ట్టి కుండ‌ల స్థానంలో క‌ల్లు దించేందుకు ప్లాస్టిక్ డబ్బాల‌ను వినియోగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. త‌డి పొడి చెత్త సేక‌ర‌ణ కార్యక్రమంలో ప్రభుత్వం పూర్తిగా విఫ‌లమైంద‌ని వినిపిస్తున్న విమ‌ర్శల నేప‌థ్యంలో తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఫొటోలు నిద‌ర్శన‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story