దున్నపోతుతో రిబ్బన్ కటింగ్ చేయించిన గ్రామస్తులు... స్పందించిన ఎమ్మెల్యే (వీడియో)

by S Gopi |
దున్నపోతుతో రిబ్బన్ కటింగ్ చేయించిన గ్రామస్తులు... స్పందించిన ఎమ్మెల్యే (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దున్నపోతుతో రిబ్బన్ కట్ చేయించి స్థానిక నాయకులకు కనువిప్పు కలిగేలా చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని గడగ్ జిల్లా బాలెహుసుర్ విలేజ్ లోని బస్ షెల్టర్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ధ్వంసం అయ్యింది. దీంతో ఆ ప్రాంతమంతా కూడా డంప్ యార్డ్ గా మారిపోయింది. దీంతో కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు బస్ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షా కాలంలో అయితే ప్రయాణికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ సమయంలో గ్రామ ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరూ కలిసి తాత్కాలిక బస్ షెల్టర్ ను నిర్మించారు. ఆ బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి దున్నపోతును ముఖ్య అతిథిగా తీసుకెళ్లారు. అంతేకాకుండా దానితో రిబ్బన్ కట్ చేయించారు. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బస్ షెల్టర్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని, అందుకు ఈ విధంగా చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే... ఆ విషయం తన దృష్టికి రాలేదని, అయితే, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story