ధ్వంసమవుతున్నా ఆగని అక్రమ దందా.. పట్టించుకోని అధికారులు

by Anukaran |   ( Updated:2022-03-03 05:16:26.0  )
ధ్వంసమవుతున్నా ఆగని అక్రమ దందా.. పట్టించుకోని అధికారులు
X

దిశ, తిరుమలాయపాలెం: మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి, గ్రానైట్ రాళ్ళ తొలకలతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. అతి పెద్ద లారీలతో మట్టి, గ్రానైట్ రాళ్లు రవాణా చేయడం వలన రోడ్లు పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తిరుమలాయపాలెం గ్రామం నుంచి వెదుల్ల చెరువు గ్రామానికి లింక్ చేస్తూ బీటీ రోడ్డు నిర్మాణం చేశారు. అదే రోడ్డులో ఓ ప్రైవేటు స్థలంలో టన్నుల కొద్ది బరువున్న గ్రానైట్ వ్యర్థాలను టిప్పర్లతో తరలిస్తూ, డంప్ చేస్తున్నారు. అలా చేసిన రాళ్లను కొంతమంది వ్యక్తులు 2/1 సైజ్ చేసి, అట్టి రాళ్లను గొలుసులతో ట్రాక్టర్ ఇంజన్ కు కట్టి నడిరోడ్డుపై ఈడ్చి కెళ్తున్నారు. ఆ తాకిడికి రోడ్డు నెర్రెలు బారుతుంది. దీంతో పాటు హస్నాబాద్ గ్రామంలో భారీ మట్టి తోలకాలు సాగిస్తున్నారు.

దీని కారణంగానే భారీ వాహనాలు వెళ్లడం వలన హస్నాబాద్ నుంచి బచ్చోడు గ్రామాలకు వెళ్లే రహదారి దెబ్బతింది. ఇలాగే కొనసాగితే రహదారులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువై అక్రమార్కులు అడ్డూ అదుపు లేకుండా రాత్రి పగలు భారీగా రవాణాలు సాగిస్తుండడంతోనే రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మేల్కొని అక్రమ తోలకాలకు అడ్డుకట్ట వేసి రోడ్ల మరమ్మతులు చేయాలని. వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా కాపాడాలని వాహనదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed