- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యి కార్మిక శాఖలో నియమితులు కావడంతో కొత్త సీఈఓ ఎంపిక అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను పంపగా కేంద్ర ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ పేరును ఖరారు చేసింది.
సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పూర్తిస్థాయి విధులు నిర్వర్తిస్తారని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు ఆయనే ఆ పదవిలో కొనసాగుతారని ఎన్నికల సంఘం తరపున ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పదవి కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులు బుర్రా వెంకటేశం, నవీన్ మిట్టర్, మహేశ్ దత్ ఎక్కా తదితరుల పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. చివరకు వికాస్ రాజ్ పేరు ఖరారైంది.