Beast movie review : విజయ్ ''బీస్ట్'' రీలీజ్.. ట్విట్టర్ లో పబ్లిక్ టాక్ హల్‌చల్..

by Mahesh |   ( Updated:2022-04-13 09:29:02.0  )
Beast movie review : విజయ్ బీస్ట్ రీలీజ్.. ట్విట్టర్ లో పబ్లిక్ టాక్ హల్‌చల్..
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రాలు ఎప్పుడు మంచి హిట్ సాధిస్తాయి. ఇప్పుడు 'బీస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురుచుస్తున్న చిత్రం ఈ రోజు విడుదల అయింది. గతేడాది 'మాస్టర్' మూవీ తో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' అనే మూవీ చేశాడు. ఈ సినిమాలో విజయ్‌తో మొదటి సారి పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మంచి జోష్‌తో సూపర్ హిట్ కోట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ భారత్ రా ఏజెంట్ పాత్రలో నటించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ తో పాటు హిందీలో కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లో 'బీస్ట్' టైటిల్‌తో విడుదలైతే.. హిందీలో మాత్రం 'రా' టైటిల్‌తో విడుదలైంది. మొత్తంగా బీస్ట్ సినిమాకు తమిళనాడు సహా అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా థియేటర్స్‌లో హంగామా చేస్తున్నారు. ఈ రోజు విడుదలైన 'బీస్ట్' సినిమా పబ్లిక్ టాక్ ట్విట్టర్ లో దుమ్ములేపుతోంది.

Advertisement

Next Story