ఓహ్.. వెయిట్ ఇలా కూడా చెక్ చేస్తారా? : విద్యా బాలన్ పిక్ వైరల్

by Mahesh |
ఓహ్.. వెయిట్ ఇలా కూడా చెక్ చేస్తారా? : విద్యా బాలన్ పిక్ వైరల్
X

దిశ, సినిమా : టాలెంటెడ్ బ్యూటీ విద్యా బాలన్ సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానమిచ్చింది. 'ఈ మధ్య బరువు ఎక్కువైపోతుంది కదా' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'పడుకుని కాళ్లపై వెయింగ్ మిషన్‌ వేసుకుని ఆడుకుంటున్న ఫొటోను షేర్ చేసి.. నేను నమ్మలేకపోతున్నా ఇన్నాళ్లు తప్పుగా వెయిట్ చెక్ చేస్తున్నానా?' అని సెటైరికల్ ఆన్సర్ ఇచ్చింది. '

డైట్ ఫాలో అవుతున్నారా?' అని ప్రశ్నిస్తే 'లేదు. ఆరోగ్యాన్నే తింటున్నా' అని చెప్పింది. ఇక ఫేవరేట్ యోగాసనం గురించి అడగ్గా.. శవాసనం అని ఆన్సర్ ఇచ్చిన బ్యూటీ, తను యోగా చేయాలనుకునేందుకు కారణం కూడా ఇదేనని వివరించింది. ఇక హాట్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోస్ అడిగితే.. 'వెదర్ హాట్‌గా ఉంది. నేను షూటింగ్ చేస్తున్నా. ఇది హాట్ ఫొటోషూటే కదా' అని ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన లొకేషన్ పిక్స్ షేర్ చేసింది విద్య.



Advertisement

Next Story

Most Viewed