- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vidya Balan: ‘లైఫ్‌లో ఒక్కసారే ఇలాంటి అవకాశం దక్కుతుంది’.. బాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్(Vidya Balan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె భూల్ భూలయ్యా-త్రీ(Bhool Bhoolayya-3) లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో విద్యా బాలన్.. మంజులిక రోల్‌లో నటించింది. భూల్ భూలయ్యా-3 బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని వెల్లడించింది.
ఈ అమ్మడు సినీ కెరీర్‌లోనే ఇదే చాలా పెద్ద విజయమని.. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ వివరించింది. అలాగే ఇలాంటి సక్సెస్ కోసమే ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నానని తెలిపింది. భూల్ భూలయ్యా ఫ్రాంఛైజీలో భాగం అవుతానని అనుకోలేదని.. మళ్లీ మంజులిక రోల్‌లో నటిస్తానని ఊహించలేదని పేర్కొంది. చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ జనాలు తన రోల్‌ను ఇంకా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. కాగా ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని వెల్లడించింది. అలాగే ఈమె గొప్ప డ్యాన్సర్‌ను కాదని చెప్పుకొచ్చింది.
మాధురీ దీక్షిత్(Mādhurī dīkṣhith) వంటి డ్యాన్స్ ఐకాన్‌తో కలిసి పాట చేయడం కోసం అయితే చాలా కష్టపడాలని ఇంటర్వ్యూలో వివరించింది విద్యా బాలన్. కానీ ఎప్పుడు డ్యాన్స్ విషయంలో ఒత్తిడికి లోనవ్వలేదని చెప్పింది. తనతో సరితూగేలా స్టెప్పులు వేయడం మాత్రం నాకు రాదని వెల్లడించింది. కాకపోతే తన పాత్రకు మాత్రం న్యాయం చేశానని.. లైఫ్‌లో ఇలాంటి చాన్స్ ఒక్కసారి మాత్రమమే దక్కుతుందని తెలిపింది. ప్రస్తుతం విద్యాబాలన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.