- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భార్య మంచిదే కానీ అక్కడి నుంచి రావట్లేదు.. బాలీవుడ్ హీరో
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రియల్ లైఫ్ రిలేషన్స్‌తో పాటు తన భార్యతో అనుబంధం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనను తాను చాలా సాధారణ వ్యక్తిగా భావిస్తూ అందరితో ఈజీగా కలిసిపోతానని చెప్పాడు. ప్రస్తుతం 'జుగ్ జుగ్ జీయో' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మనిషికి ఓపిక, బాధ్యత ఉన్నప్పుడే బంధాలన్నీ దీర్ఘకాలం కొనసాగుతాయి. మా పేరెంట్స్‌తో కూడా అలాగే ఉంటాను. నా భార్య నటాషా దలాల్‌తో జీవితం అమేజింగ్‌గా ఉంది.
మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవడం గొప్ప అనుభూతినిస్తుంది. తనలాంటి మంచి భార్యకి ఓ మంచి భర్తగా ఉండటం నా బాధ్యత' అని వివరించాడు. ఇక తన ఇంటికి దగ్గరలోనే నటాషా పేరెంట్స్ ఇల్లు ఉంటుందని, తాను షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లినపుడు కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగితే 'నా ఇంట్లో ఉన్నా' అని తన పుట్టింటి గురించే చెబుతుందన్న వరుణ్.. తనకింకా పేరెంట్స్ ఇల్లు తనదేనన్న భావన పోలేదని సరదాగా చెప్పుకొచ్చాడు.