- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యూటీ ట్రిక్స్.. అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవింగ్ ఇలా..
దిశ, ఫీచర్స్: కాళ్లు, చేతులపైన పెరిగే వెంట్రుకలను తొలగించేందుకు మహిళలు అవస్థలు పడుతుంటారు. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ సహా రేజర్ షేవింగ్ వంటి పద్ధతులను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో చర్మంపై మంటలు, మచ్చలు, రేజర్ గాట్లతో పాటు ఇన్‌గ్రోన్ హెయిర్ ఇష్యూస్‌తో ఇబ్బందులు పడుతుంటారు. అందుకే కాళ్లను రాత్రిపూట షేవ్ చేయాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. రొటీన్ షేవింగ్ పద్ధతులు మార్చుకోవడం ద్వారా సిల్కీ స్కిన్ అనుభూతిని పొందవచ్చని చెబుతున్నారు. అందుకోసం మరిన్ని చిట్కాలు..
పడుకునే ముందు చేస్తేనే..
సాధారణంగా ఎవరైనా షేవ్ తర్వాత స్నానం చేస్తారు. కానీ షేవింగ్‌కు ముందు 15 నిమిషాలు వెట్ చేయడం వల్ల జుట్టు మృదువుగా మారి, ఫోలికల్స్ తెరుచుకుంటాయని, తద్వారా షేవింగ్ స్మూత్‌గా ఉంటుందని సూచిస్తున్నారు. ఇక పడుకునే ముందు షేవింగ్ చేయడం వల్ల కాళ్లు మరింత మృదువుగా తయారవుతాయని చెప్తున్నారు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కాళ్లు కొద్దిగా వాపెక్కుతాయి. అందువల్ల జుట్టు తిరిగి దాని ఫోలికల్స్‌లోకి సులభంగా చేరుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 'డ్రై' షేవ్ చేయకూడదు. క్రీమ్ లేదా జెల్ వాడటం ద్వారా చర్మంపై రేజర్ సులభంగా జారేందుకు లూబ్రికేషన్‌ను సృష్టించి కోతలను నివారిస్తుంది. ఇక షేవింగ్‌ను చర్మానికి దగ్గరగా చేస్తే ఇన్‌గ్రోన్ హెయిర్, రేజర్ బర్న్ సమస్యలు వస్తాయి. ఆ తర్వాత తలెత్తే ఎర్రటి కురుపుల నివారణకు వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియేటింగ్ బాడీ వాష్ లేదా బాడీ స్క్రబ్ ఉపయోగించాలి.