Kishan Reddy: కేసీఆర్‌కు ఆ హక్కు లేదు.. మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు

by Satheesh |   ( Updated:2022-08-02 09:55:12.0  )
Union Minister Kishan Reddys Speech in Bandi Sanjay Praja sangrama Yatra Inaugural Meeting
X

దిశ, వెబ్‌డెస్క్: Union Minister Kishan Reddy's Speech in Bandi Sanjay Praja sangrama Yatra Inaugural Meeting| బీజేపీ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత సందర్భంగా యాదాద్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దళిత బంధులాగా బీసీ బంధు ఇస్తారా..? నిరుద్యోగులకు ఉద్యోగాలకు ప్రకటిస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి ఇచ్చారని సభా వేదికగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నెలలో సగం రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటారని.. ఇంకో సగం రోజులు ప్రధాని మోడీని తిట్టడానికే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్ధరించడం కాదు.. ముందు రాష్ట్ర సమస్యలను పరిష్కారించాలని హితవు పలికారు. ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్య ఏమైందని నిలదీశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రంలో మజ్లిస్, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: టీసీ కావాలంటే... మేం ఎంత అడిగితే అంత ఇవ్వాలి..

Advertisement

Next Story

Most Viewed