పబ్బుల నగరంగా హైదరాబాద్.. ఉద్యోగాలు లేకే డ్రగ్స్‌కి అలవాటు

by samatah |   ( Updated:2022-04-05 14:26:41.0  )
పబ్బుల నగరంగా హైదరాబాద్.. ఉద్యోగాలు లేకే డ్రగ్స్‌కి అలవాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాలు లేక నిరుద్యోగులు డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మరో పంజాబ్ లాగా మారుతుందని, డ్రగ్స్ కంట్రోల్ చేస్తామన్న వారికి ఓటేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కూడా ఎవరు డ్రగ్స్ కంట్రోల్ చేస్తామన్న వారికే ఓటేస్తారని అన్నారు. దేశం మొత్తం డ్రగ్స్ కంట్రోల్ చేయాలని రేవంత్ రెడ్డి కేసు వేశారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఈడీ లెటర్ రాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సెంట్రల్ ఏజెన్సీ‌తో ఇన్వెస్టిగేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దారని, టీఆర్ఎస్ ప్రభుత్వం 2017 లో డ్రగ్స్ విషయంలో ఎంతోమంది ప్రముఖులను పట్టుకున్నారని, అకున్ సబర్వాల్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ని వేశారని, ఎవరిపై కూడా కేసులు కాలేదని, అందరిని వదిలిపెట్టి.. అకున్ సబర్వాల్‌ని అక్కడి నుంచి పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా‌కి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందని అప్పుడే తెలిసిందన్నారు. పబ్ కల్చర్ తెలంగాణ‌ది కాదన్నారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌లలో 93 పబ్‌లు ఉన్నాయని, 250 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయని, హైదరాబాద్ పబ్బుల నగరంగా పేరు వచ్చిందన్నారు. రాడిసన్ హోటల్ లో అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల వరకు నడిచిందన్నారు. పబ్బుల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఎందుకు మానిటరింగ్ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాడిసన్ హోటల్‌లో 150 మందిని పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయారని, వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని ఎందుకు ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.

నేడు అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నా

పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా, వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నా చేయాలని, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story