Priyanka Upendra: నా పాన్ ఇండియా మూవీ అందరూ చూడండి.. నటి కామెంట్స్ వైరల్

by sudharani |
Priyanka Upendra:  నా పాన్ ఇండియా మూవీ అందరూ చూడండి.. నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఉగ్రావతారం’ (Ugravataram). ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.జి. సతీష్ (SG Satish) నిర్మించగా.. గురుమూర్తి (Guru Murthy) దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ (song), ట్రైలర్ (Trailer)ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Trailer), సత్య ప్రకాష్ పాటను విడుదల చెయ్యగా.. రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంతరం మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు.

ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) మాట్లాడుతూ.. ‘హైద్రాబాద్ (Hyderabad) నాకు చాలా లక్కీ సిటీ. ఉపేంద్ర (Upendra) గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురుమూర్తి (Guru Murthy) వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. కెమెరామెన్ నందకుమార్ (Nandakumar) అందరినీ బాగా చూపించారు. నటరాజ్ (Nataraj) అద్భుతంగా నటించాడు. రాజు తెలుగులో మంచి పాటలు, మాటలు ఇచ్చారు. కృష్ణ బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed