నా జీవితంలో సంతోషకరమైన క్షణం ఇదే.. బుక్ సేల్స్‌‌పై ట్వింకిల్ రియాక్షన్

by Manoj |
నా జీవితంలో సంతోషకరమైన క్షణం ఇదే.. బుక్ సేల్స్‌‌పై ట్వింకిల్ రియాక్షన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా రచయిత అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కాగా సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి రచయిత్రిగా రాణించేందుకు కష్టపడుతున్న భామ.. 2015లో 'మిసెస్ ఫన్నీబోన్స్' అనే తన మొదటి పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ బుక్‌కు మార్కెట్లో పెరిగిన డిమాండ్‌తో వేగం పెంచిన ట్వింకిల్.. 2017లో 'ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్', 'పైజామాస్ ఆర్ ఫర్గివింగ్' అనే టైటిల్‌తో కూడిన మరిన్ని పుస్తకాలను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే వీటిని ఆన్‌లైన్ వేదికల్లోనూ అమ్మకానికి పెట్టిన స్టార్ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ విక్రయించేలా ప్లాన్ చేసుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తను రాసిన పుస్తకాలను సేల్ చేయడం చూసి ఆనందంతో గెంతులేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసిన రైటర్.. 'నా పుస్తకాలు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విక్రయించడం చూశాను. ఇది నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. మీరు ఏది చదివారు?' అంటూ ఆ హ్యాపీ మూమెంట్‌ను పంచుకుంది. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అభిమాని 'నేను అవన్నీ చదివాను. ఈ ట్రాఫిక్ సిగ్నల్ వద్దే కొనుగోలు చేసాను. 'పైజామాస్ ఆర్ ఫర్గివింగ్' మీ బెస్ట్ వర్క్' అంటూ ట్వింకిల్‌ను పొగిడేశాడు.

Advertisement

Next Story

Most Viewed