- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆమె ఒంటిపై గాయం.. అందమైన కళాకృతికి జీవం.. అదెలా..?
దిశ, ఫీచర్స్ : మగువ ఒంటిపై గాయం లేదా మరక అంద విహీనంగా మారుస్తుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తుంది. కానీ ఆ మరకలు, చారికలే.. విరబూసిన పువ్వులు, అల్లుకున్న మల్లెతీగలు, ఎగిరే సీతాకోకచిలుకలుగా మారిపోతే ఎంత బాగుంటుంది కదా. అదే పని చేస్తోంది బ్రెజిల్‌కు చెందిన ప్రసిద్ధ టాటూ ఆర్టిస్ట్ కార్లా మెండిస్. 'వీ ఆర్ డైమండ్స్' ప్రాజెక్ట్‌లో భాగంగా అతివల శరీరాలను అందమైన కళాకృతులుగా తీర్చిదిద్దుతోంది. కళతో ఒకరి జీవితాన్ని మార్చవచ్చని, మళ్లీ వారికి ప్రాణం పోయొచ్చని నిరూపిస్తోంది.
మానసిక, శారీరక హింసతో పాటు కాలిన, ఇతర శారీరక గాయాలతో బాధపడుతున్న మహిళల్లో సంతోషాన్ని నింపేందుకు 2016లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టగా.. 2019లో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా మారింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలు, మహిళలు తమ తమ గాయాల తాలూకు కథలను ఆమెతో పంచుకుంటుండగా, ఆ గాయానికి వర్ణరంజిత టాటూను జతచేసి, మరకతో పాటు దాని జ్ఞాపకాన్ని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. టాటూ సెషన్స్ తర్వాత తాము ఎప్పటికీ 'డైమండ్స్' అని ఫీల్ అయ్యేలా చేస్తున్న క్లారా.. ఇందుకోసం ఎలాంటి చార్జీలు తీసుకోదు. టాటూల కోసం ఆమెకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు తప్పనిసరిగా తమ కథతో పాటు గాయాలకు సంబంధించిన ఫొటోలను ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌కు పంపాల్సి ఉంటుంది.