- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధులకు, వికలాంగులకు గుడ్ న్యూస్.. మీ కోసమే స్పెషల్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను చేయనుంది. ఇవాళ ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శనం టోకెన్లు బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల కోటా టోకెన్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు రోజుకు వెయ్యి టికెట్ల చొప్పున విడుదల అవుతాయి. టికెట్లు పొందిన భక్తులను రోజూ ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతి ఉంటుంది. కొవిడ్‌వ్యాప్తి తగ్గడంతో రెండేళ్ల తర్వాత వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ మళ్లీ ప్రారంభించింది.
మరోవైపు తిరుమల శ్రీవారి పుష్కరిణిలోకి గురువారం నుంచి భక్తులను టీటీడీ అనుమతిస్తోంది. కొవిడ్ ప్రభావం తగ్గడంతో 2020 మార్చిలో శ్రీవారి పుష్కరిణిని మూసివేసింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో పుష్కరిణిలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఈనెల 10న ఆస్థానం.. 11న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. కొవిడ్ ఆంక్షల నుంచి మినహాయింపు రావడంతో టీటీడీ టికెట్ల కోటా పెంచింది.
గత నెల నుంచి దర్శన టికెట్లను భారీగా పెంచింది. ప్రతిరోజూ 75వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే శ్రీవారి హుండీకి ఆదాయం పెరుగుతోంది. అలాగే తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పెరిగింది. ఇటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల్ని అనుమతిస్తున్నారు. అలాగే స్వామివారి దర్శనం అనంతరం శఠారి, తీర్థం కూడా అందిస్తున్నారు. మొత్తానికి తిరుపతిలో మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.