జనగామ సభకు బస్సులో వెళ్లిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

by Disha News Web Desk |
జనగామ సభకు బస్సులో వెళ్లిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్యకర్తలతో కలిసి బస్సులో జనగామ సభకు బయలుదేరి వెళ్లారు. వరంగల్ తూర్పులో వాడవాడల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో, చేతుల్లో పార్టీ జెండాలను చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా కార్యకర్తల కోలాహలం ఉత్సహంగా 10 వేల మంది వివిధ వాహనాల ద్వారా బయలు దేరి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని అన్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్న నేను.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో కార్పొరేటర్‌గా, వరంగల్ మేయర్‌గా అనంతరం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. దీంతో ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం ఈ 8 సంవత్సరాల్లోనే జరిగిందన్నారు. జనగామ సాక్షిగా దేశానికి సీఎం కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారన్నారు. కేసీఆర్ సందేశం కోసం, వారి నాయకత్వం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. దేశంలో పెను మార్పును చూడబోతున్నామని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed