వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ కీలక నేత భేటీ!

by S Gopi |
వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ కీలక నేత భేటీ!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ లో రాజకీయ వేడితో ఎన్నికల వాతావరణం మొదలైంది.అధికార పక్షం, ప్రతి పక్షాలు ముందస్తుకు సై.. అంటే సై అంటూ కాలు దువ్వుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ లోకి వెళుతున్నారు నాయకులు. టీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఏ పార్టీలోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే అంచనాలను ముఖ్య అనుచరులతో కలిసి వేసుకుంటున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అంతే కాదు.. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత కావడంతో మరింత ఆసక్తి రేపుతోంది. కాగా, పొంగులేటి వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. ఖ‌మ్మం నుంచి నేరుగా తాడేప‌ల్లి వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌ను కలిసి చర్చలు జరిపారు. అయితే పొంగులేటి జగన్‌ను దేని కోసం కలిశారు.. మళ్లీ వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేస్తారా..? జగన్ ఏమైనా ఆఫర్ ఇచ్చారా.. అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పొంగులేటి జగన్‌తో భేటీ కావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed