- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ హూ అంటే తగ్గేదేలే..! అక్కడ ఎలక్షన్ వేడి షురూ ..
దిశ ప్రతినిధి రంగారెడ్డి/ వికారాబాద్ / పెద్దేముల్ : ఎలక్షన్లకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తాండూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి ఇప్పుడే మొదలైంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పట్నం వర్సెస్ పైలెట్ అంటూ తాండూర్‌లో రోజుకో రాజకీయ రగడ జరుగుతూనే ఉంది. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరు తాండూర్ మున్సిపల్ పై బాగానే ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన స్వప్న పరిమల్, అగ్రిమెంట్ ప్రకారం మరో 4, 5 నెలల్లో రాజీనామా చేయాల్సి ఉండగా, ఈ మధ్యనే మీడియాతో మాట్లాడిన మహేందర్ రెడ్డి చైర్ పర్సన్ పదవి విషయంలో తగ్గేదేలేదని, ఐదేళ్ల వరకు సప్న పరిమల్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుందని పట్నం మహేందర్ రెడ్డి బహిరంగంగానే స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ వర్గం కేసీఆర్, కేటీఆర్ స్థాయిలో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఆ వర్గం ఎన్ని పైరవీలు చేసిన పట్నం వర్గం స్పీడ్‌ను తట్టుకోవడం అసాధ్యమని తాండూరు రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. పైగా నిజమైన టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ నేతలు అందరు కూడా మహేందర్ రెడ్డి వైపు ఉన్నారని, రోహిత్ వెంట కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారని చర్చ నడుస్తుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సర్వేలో కూడా రోహిత్ రెడ్డి గెలుపు కష్టమే అని తేలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కారణంగా టీఆర్ఎస్ నుంచి తాండూరు నియోజకవర్గంలో ఎవరికీ సీటు ఇవ్వాలని అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సర్వే అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే తాండూర్ రాజకీయాల్లో అసలు ట్విస్ట్ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, సునీతా మహేందర్ రెడ్డి అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తుంది. సునీత మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం కళ్ళు మూసుకొని గెలుస్తుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని పట్నం వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా నాకు లేదా నా సతీమణి సునీతా మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టీకెట్ ఇవ్వాలని, లేనిపక్షంలో మరో పార్టీలోకి జంప్ అవ్వడం ఖాయం అనే క్లారిటీ సీఎం కేసీఆర్‌కు మహేందర్ రెడ్డి ఇప్పటికే ఇచ్చినట్లు తెలుస్తుంది. అదే గనక జరిగితే తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదని, స్వింగ్ మొత్తం పట్నం కుటుంబం వైపే తిరుగుతుందని, పరిస్థితులు ఆ స్థాయికి వస్తే పైలెట్ టీఆర్ఎస్‌లో ఉన్న, తిరిగి సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎలాంటి ఉపయోగం లేదని, దాంతో తాండూరు నియోజకవర్గంలో ఇటు రోహిత్ రెడ్డి అటు టీఆర్ఎస్ పార్టీ పరాజయం తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ విషయంలో మహేందర్ రెడ్డి దగ్గరకు ఎవరైనా బేరసారాలకు వస్తే మన దగ్గర బేరాలు లేవమ్మ అంటూ స్టేట్ ఫార్వర్డ్ చేస్తున్నట్లు సమాచారం. పైగా పైలెట్‌ను పల్టీ కొట్టించడానికి ఇప్పటికే రంగం సిద్ధం అయినట్లు తెలుస్తుంది. రేపో మాపో అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్లడానికి మహేందర్ రెడ్డి రేసుగుర్రంలా పరుగుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాల పట్ల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పట్నం, పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాడు. ఇదిలాఉంటే తాండూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం మరో ఇద్దరు నేతలు సైతం భారీగానే పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నుంచి తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఎవరికి దక్కుతుంది అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.