Bigg Boss : ఇలాంటి పూజ ఎక్కడ చూడలేదురా బాబోయ్.. లేడీ కంటెస్టెంట్‌పై నెటిజన్స్ ట్రోల్స్..!

by Anjali |   ( Updated:2024-11-20 06:23:57.0  )
Bigg Boss : ఇలాంటి పూజ ఎక్కడ చూడలేదురా బాబోయ్..  లేడీ కంటెస్టెంట్‌పై నెటిజన్స్ ట్రోల్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బిగ్‌బాస్‌(Bigg Boss)లో కంటెస్టెంట్లు టాస్కుల విషయంలో దూసుకుపోతున్నారు. ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా ఆడుతున్నారు. ప్రతి ఇండస్ట్రీలోను బిగ్‌బాస్ సీజన్ స్టార్ అయింది. కన్నడ(Kannada), హిందీ(Hindi), తమిళం(Tamil), తెలుగు(Telugu) భాషల్లో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ల హవా నడుస్తున్నాయి. పాత కంటెస్టెంట్లు(Old contestants) వైల్డ్ కార్డు(wild card) ద్వారా ఎంట్రీ ఇచ్చి.. హౌస్‌లో మరింత రచ్చ చేశారు. కొంతమంది ఎలిమినేట్ అయి.. ఇంటికెళ్లారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు విన్నర్ ట్రోపీ(Winner trophy) కోసం నువ్వా నేనా? అన్నట్లుగా పోటీపడుతున్నారు.

ఇకపోతే కన్నడ బిగ్ బాస్‌(Bigg Boss Kannada)కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడలో ఈ రియాలిటీ షో స్టార్ట్ అయి.. 8 వారాలు అవుతుంది. ఇక ఈ షో స్టార్టింగ్ నుంచే వివాదాలు జరుగుతున్నాయి. హౌస్ లోని కంటెస్టెంట్ల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రీసెంట్ గానే బిగ్‌బాస్ లో పోలీసు కేసు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రోల్స్ కు గురవుతుంది. మరీ ఏ విషయంలో నెట్టింట రచ్చ జరుగుతుందో ఓసారి తెలుసుకుందాం..

బిగ్ బాస్ హౌస్‌లో గణేశుడి పూజ ఏర్పాటు చేశారు. పైగా పూజ చేసుకోవాలని అనుకున్న వారికి బిగ్‌బాస్ నిర్వాహకులు అన్ని సదుపాయాలు కల్పించారు కూడా. ఇక చైత్ర కుందపుర(Chaitra Kundapura) గణేశుడికి స్పెషల్ పూజ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇలాంటి పూజ ఎక్కడ.. ఎప్పుడూ చూడలేదమ్మా అంటూ నెట్టింట జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చైత్ర కుందపుర హౌస్‌లో టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోతుంది.

Advertisement

Next Story