జూలు విదిల్చిన నాలుగో సింహం.. వారం రోజుల్లో 16,937 కేసులు

by Nagaya |
జూలు విదిల్చిన నాలుగో సింహం.. వారం రోజుల్లో 16,937 కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాహనాలపై బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్లను దుర్వినియోగం చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గ్రేటర్‌లో రెండువారాల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా వారం రోజుల్లోనే 16,937 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందులో నంబర్ ప్లేట్ వయోలేషన్స్ కేసులు 9387 కాగా, సౌండ్ పొల్యూషన్ కేసులు 3270 , బ్లాక్ ఫిల్మ్, ఎమ్మెల్యే, ఎంపీ ప్రభుత్వ వాహన స్టిక్కర్ ఉల్లంఘన కేసులు 4280 నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలపై నంబర్ ప్లేట్లు ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఉండాలని వాహనదారులకు సూచించారు. నంబర్ ప్లేట్లపై బొమ్మలు, పేర్లు వివిధ అక్షరాలు ఉండకూడదన్నారు. అదే విధంగా కంపెనీల నుంచి వాహనాలకు వచ్చే హారన్లు మాత్రమే ఉండాలని, విరుద్ధంగా వివిధ రకాల హారన్లు అమర్చితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలపై బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్లను దుర్వినియోగం చేసేవారిపై రూ.700 జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed