- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: అడివి శేష్(Adivi Sesh) మొదట పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘క్షణం’ (Kshanam)మూవీతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. అలాగే హిట్-2(Hit-2), మేజర్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రజెంట్ ‘డెకాయిట్’(Dacoit) మూవీతో అడివి శేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా, ఆయన ఆహా(aha) గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇదే పోస్ట్‌ను అడివి శేష్(Adivi Sesh) ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఇక అంబాసిడర్‌గా వ్యవహరించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఆహా గోల్డ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆహా OTT ప్లాట్‌ఫారమ్ అభిమానులను అద్భుతమైన కంటెంట్‌తో కనెక్ట్ చేయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే మరపురాని అనుభవాలను కూడా అందిస్తుంది. స్నీక్ పీక్‌లను చూడటం అలాగే సెట్‌లో సెలబ్రెటీలను కలిసే అవకాశం కల్పించడం నిజంగా బాగుంది.
ఇది అభిమానులను షూటింగ్‌లో పాలుపంచుకోవడానికి అలాగే వారి అభిమాన హీరోలను , హీరోయిన్స్‌ను కలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆహా గోల్డ్ ప్రీమియం(AHA Gold Premium) వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం కేవలం రూ.899కి సబ్‌స్క్రయిబ్ చేసుకోండి’’ అని చెప్పుకొచ్చారు. ఇక అడివి శేష్ అంబాసిడర్ అని తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.