కాల్ చేస్తే చాలు మొక్క నాటేస్తారు.. డోబ్రియాల్ ఐడియాకు నెటిజన్లు ఫిదా!

by Nagaya |
కాల్ చేస్తే చాలు మొక్క నాటేస్తారు.. డోబ్రియాల్ ఐడియాకు నెటిజన్లు ఫిదా!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ నూతన పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు 'హరిత హారం' ద్వారా భారీ ఎత్తున మొక్కలను పెంచుతున్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చదనం ఆశించిన మేరకు పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో కూడా మొక్కలను నాటేంచే విధంగా డోబ్రియాల్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 108,104,100 మాదిరిగానే మొక్కలను నాటేందుకు ఓ టోల్ ‌ఫ్రీ నెంబర్‌ను తీసుకొస్తే ఎలా ఉంటుందంటూ నెటిజన్లను ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇదో మంచి ఐడియా అని.. అమలు చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story