Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (02-12-2024)

by Anjali |   ( Updated:2024-12-01 21:45:34.0  )
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (02-12-2024)
X

మేష రాశి: నేడు మేష రాశి వారు పెద్దవారికి ఆర్థికంగా సహాయం చేస్తారు. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. మీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఎక్కువగా ఆటల్లో పాల్గొంటారు. ఆఫీసులో నేడు ఎంతో అద్భుతంగా గడిచిపోతుంది. కుటుంబం కోసం రిస్క్ చేస్తారు. మీ భాగస్వామి మీపై మునుపెన్నడు లేని విధంగా సంతోషపెడతారు.

వృషభ రాశి: నేడు ప్రయాణాలు అంతా మంచివి కాదు. పైగా దూర ప్రయాణాలు అస్సలు చేయవద్దు. నేడు ఖర్చు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. వ్యాపారాల్లో అపజయం చవిచూస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం బంధం బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది.

మిథున రాశి: మానసికంగా సంతోషంగా ఉంటారు. రోజంతా భాగస్వామి గురించే ఆలోచిస్తారు. నేడు చాలా ఎనర్జీగా పని చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కోపం రాగానే ఎదుటివారిపై మండిపడుతూ మాట్లాడకండి.

కర్కాటక రాశి: ఆరోగ్యం బాగుపడే విషయాలపై దృష్టి పెట్టండి. వ్యాపారం ప్రారంభిస్తామని అప్పు కోసం మీ దగ్గరకు వస్తే.. చూసి చూడనట్లు వదిలేయండి. ఆర్థిక పరంగా నష్టపోతారు. ఎక్కడ, ఎలా ఖర్చు అవుతున్నాయో తెలియదు. కాగా డబ్బు ఖర్చు పెట్టేవిషయంలో జాగ్రత్తగా మెలగండి. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి.

సింహ రాశి: ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఫైనాన్షియల్‌గా లాభాలు పొందుతారు. అనుకున్నవి సాధిస్తారు. ఎక్కువగా పాటలు వింటారు. కానీ ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ ఇంటికి చుట్టాలు వస్తారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కొన్ని విషయాల్లో ఒత్తికి గురవుతారు.

కన్యా రాశి: కాస్త ఓపిక ముఖ్యం. నేడు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టకండి. మిమ్మల్ని ఇష్టపడేవారితో స్నేహితులతో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్ గా ఉంటారు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబీకుల గురించి ఆలోచిస్తారు. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది. వైవాహిక జీవితం కంట్రోల్ తప్పుతుంది.

తులా రాశి: ఎప్పటి నుంచో ఒంటరిగా ఫీల్ అవుతోన్ భావన నేడు దూరం అవుతుంది. ఫ్యామిలీ, రిలేషన్స్‌తో మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. ఎవరికైనా దేనినైన చేయగలుగుతా అనుకుంటూనే వాగ్దానం చెయ్యండి. లేకపోతే మాట ఇవ్వకండి.

వృశ్చిక రాశి: ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి ప్రేమలో నిరాశకు గురవుతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌ తో గడుపుతారు.

ధనుస్సు రాశి: మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు మీ అదుపులో ఉంచుకోవడం బెటర్. ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో వెబ్ సిరీస్‌లు చూస్తారు. అన్నాదమ్మలు, అక్కాచెల్లెల్లతో కలిసి సినిమాకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.

మకర రాశి: నేడు చాలా ఎనర్జీగా ఉంటారు. కానీ మీ వంకర బుద్ధి నేడు తల్లిదండ్రుల్ని బాధపెడుతుంది.అందరినీ బాధించేకంటే, వినయంగా ఉండడం ఎంతో మంచిది. నేడు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. డబ్బు సంపాదిస్తారు.కానీ ఇట్టే మాయమైపోతుంది. భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మేలు. మీ భాగస్వామితో అన్ని విషయాలు పంచుకుంటారు. మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది.

కుంభ రాశి: కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ తర్వాత దాని పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు. మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. దీంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకుంటారు.మీకు మీ ప్రియమైన వ్యక్తి మధ్య మూడవ వ్యక్తి జోక్యం చేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటారు.

మీన రాశి: ఏ విషయాల్లోనైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందడం మేలు. చిన్న చిన్న విషాలకే ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంటారు. సన్నిహిత మిత్రులను కలిసేందుకు అత్యద్భుతమైన రోజు ఇది. కానీ ఇంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుంటారు. నేడు ఎక్కువగా బయట గడుపుతారు. సమయం వృథా చేసుకోకుండా అవసరమైన పనులపై దృష్టి సారించడం మంచిది. ఇతరులతో గొడవ పడే చాన్స్ ఉంటుంది. కొన్ని అనివార్య కారణము వల్ల మీరు ఆఫీసు నుంచి తొందరగా వెళ్లిపోతారు.

Advertisement

Next Story