- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (5-11-2024)
మేష రాశి: నేడు మేష రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు. ఇవాళ మంచి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. మంచి జరగాలంటే పక్షకులకు ఆహారం వేయండి.
వృషభ రాశి: నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.
మిథున రాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి. మిమ్మల్ని చికాకు తెప్పిస్తూన్న బాధ్యతల్ని నేడు మీ బంధువులు వారిమీద వేసుకుంటారు. మీ భాగస్వామి ఇబ్బంది పెడుతారు. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆఫీసులో గుర్తింపు పొందుతారు.
కర్కాటక రాశి: ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కచ్చితంగా కనిపిస్తుంది. మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకుంటుంది. ఎదుటివారు మీతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు. కానీ మీరు కూడా వారితో కమ్యూనికేట్ అవ్వడం మంచిది. శ్రోతలాగా మిగిలిపోవడం కన్నా. స్టేజ్ పైన ప్రసంగాలు, సెమినార్లు ఇస్తారు. విద్య, ఉద్యోగం పరంగా అంతా మేలు జరుగుతుంది. వృత్తిపరంగా కూడా లాభాలు పొందుతారు.
సింహ రాశి: ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే బెటర్. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ లైఫ్ లో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. కానీ చిన్న చిన్న విషయాల కారణంగా విచారడం మంచిది కాదు. మీ భాగస్వామి ఆరోగ్యం పరంగా ఇబ్బందిపడతారు.
కన్యా రాశి: మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది.
తులా రాశి: నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు.ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి.
వృశ్చిక రాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ప్రేమలో నిరాశకు గురవుతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో ఎక్కవ సమయం గడపటానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు తెప్పిస్తుంది.
ధనుస్సు రాశి: నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. కానీ తొందరగానే ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు.
మకర రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. శుభవార్తలు వింటారు. కేవలం మిమ్మల్నే కాకుండా కుటుంబం మొత్తం సంతోషపడే క్షణాలను అనుభవిస్తారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు వెళ్తారు. ఇవాళ వారితో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ రాశి వారు నేడు ఏ పని చేసిన విజయం సాధిస్తారు. మీ భాగస్వామి ఎంతో ఎనర్జీగా, ప్రేమగా కనిపిస్తారు.
కుంభ రాశి: విహార యాత్రలకు వెళ్తారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. కానీ ఆర్థికంగా నష్టపోతారు. అనవసరపు ప్రయాణాలు చేయవద్దు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు. కానీ సంతోషంగా డే మొత్తం గడుపుతారు. ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి. అవసరమైన వాటికోసం మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి.
మీన రాశి: ఫ్రెండ్స్‌తో సాయంత్రం పూట సమయం గడుపుతారు. దీంతో సంతోషంగా ఉంటారు. మత్తు కలిగించే హార్డ్ డ్రింకులకు దూరంగా ఉండటం మేలు. మీ ప్రేమికులతో గొడవలు అయ్యే అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా వివాదాలు రేగకుండా చూసుకోండి. ఉద్యోగం కోసం తెగ కష్టపడుతుంటారు. ఎక్కువగా పార్కులో గడపడానికి ఇష్టపడతారు. మీ భాగస్వాములతో ఢిపరెంట్‌గా కొత్తకొత్త ప్లాన్స్ చేస్తారు.
- Tags
- Today Horoscope