- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (29-10-2024)
మేష రాశి: నేడు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ పనిమీద శ్రద్ధ పెట్టరు. ఈ రాశిలో ఉన్నవారికి వివాహం అయిన వాళ్లు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. స్నేహితులతో ఎక్కువగా గడుపుతారు. ఇతరులు మీ సమయాన్ని వృథా చేసేందుకు డిమాండ్ చేస్తారు. మీ భాగస్వామితో రొమాంటిక్ విషయాలు మాట్లాడుతుంటారు.
వృషభ రాశి: కొందరి మాటలు మీకు కోపం తెప్పించగలవు. ఆర్థికంగా బాగానే ఉంటారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫలితాలు అద్భుతంగా సంభవిస్తాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయిస్తారు. సినిమాలకు వెళ్తారు. వైవాహిక జీవితంలో కొన్ని చిక్కులు ఉంటాయి.
మిథున రాశి: పరపతి ఉన్న వ్యక్తులు మీకు సపోర్ట్ గా ఉంటారు. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. నేడు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. నేడు మీ ప్రేమ కథ ఓ మలుపుతిరుగుతుంది. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
కర్కాటక రాశి:నేడు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులనే కాకుండా రిలేషన్స్ మనసు కూడా బాధపడేలా మాట్లాడే అవకాశం ఉంది. నేడు బయటికి వెళ్లి ఆహ్లాదంగా గడపండి. అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీ భాగస్వామి కాస్త చికాకు పడుతారు కానీ కాస్త ఓపికగా ఉండండి.
సింహ రాశి: ఆస్తుల విషయంలో గొడవలు వస్తాయి. మనసు అల్లాకల్లోలంగా ఉంటుంది. కర్చులు మరింత పెరుగుతాయి. రాత్రి ఎక్కువసేపు ఫోన్లలో మాట్లాడుతారు. కొందరిచే ప్రశంసలు అందుకుంటారు. నేడు మీ భాగస్వామి మీ ప్రేమను తెలుసుకుంటాడు.
కన్యా రాశి: ఆర్థికంగా లాభాలు పుంజుకుంటాయి. మీరు ఊహించని నేడు జరుగుతాయి. మీ మూడ్ ఇవాళ బాగుంటుంది. మీరే ఇతరులతో కావాల్సుకుని మాట్లాడుతారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. మీ భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కాస్త బాధకు గురవుతారు.
తులా రాశి: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం చేసేముందే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి. దూరమైన సంబంధాలు దగ్గరవుతాయి. నిజమైన ప్రేమంటే ఏంటో నేడు ఈ రాశివారు తెలుసుకుంటారు.
వృశ్చిక రాశి: మీ దగ్గర అప్పు తీసుకున్నవారు నేడు మీకు చెల్లిస్తారు. ఇవాళ ఎక్కువగా ఆటలు ఆడటానికి ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. మీ భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. మీరు బయటకు వెళ్లి ఇంటికొచ్చే సమయంలో మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. కొత్తగా ఆలోచిస్తారు. మనసు కుదుటపడుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్వల్పకాలపు పిక్ నిక్ ను ప్లాన్ చేసుకుంటారు. కానీ వృత్తి పరంగా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు మీ ఇంటికి అతిథులు వస్తారు.
మకర రాశి: మితిమీరిన అదనపు పనిని నేడు మీ నెత్తిమీద వేసుకుంటారు. కానీ విశ్రాంతి అవసరం. ఇవాళ డబ్బు విలువ తెలుసుకుంటారు. గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కుకుంటారు. స్నేహితులతో పార్కుకు వెళ్తారు. సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు.
కుంభ రాశి: నేడు మీలో విశ్వాసం పెరుగుతుంది. స్టాక్ అండ్ మ్యూచ్యువల్ ఫండ్ లలో మదుపు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. నేడు కొత్తగా ఆలోచిస్తారు. మీ జీవిత భాగస్వామితో మునుపెన్నడూ లేని విధంగా గొప్పగా గడుపుతారు.
మీన రాశి: ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతారు. గొప్ప వ్యక్తుల సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతారు. గతంలో మీరు చేసిన తప్పులేంటో నేడు తెలుసుకుంటారు. ఖాళీ సమయంలో కొత్తగా ఆలోచించి.. పనులను ప్రారంభిస్తారు. మీ భాగస్వామి నేడు మీ కష్టాన్ని గుర్తించి మీపై ప్రశంసలు కురిపిస్తారు.
- Tags
- Today Horoscope