- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుమ్మల నాగేశ్వరరావు సెన్సేషనల్ కామెంట్స్.. టీఆర్‌ఎస్‌కు గుడ్ బై?
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్యనేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఇప్పుడు తన దృష్టి అంతా పాలేరుపైనే అని వ్యాఖ్యానించారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. గత కొంతకాలంగా ఖమ్మం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. మంత్రి పువ్వాడ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తుమ్మల నాగేశ్వరరావుకు అసలు పొసగడం లేదు. అంతర్గత విబేధాలపై మంత్రి కేటీఆర్ పలుమార్లు నేతల మధ్య మధ్యవర్తిత్వం చేశారు. విబేధాలను వదిలిపెట్టి పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో కూడా నేతల మధ్య విబేధాలపై చర్చించారు. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అయినా నేతల మధ్య విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తుమ్మల నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గతంలో కూడా ఆయన పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తుమ్మల చేసిన వ్యాఖ్యలతో ఆయన టీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ముందస్తు ఎన్నికల వస్తాయనే సంకేతంలో భాగంగానే కార్యకర్తలతో ఎప్పుడైనా పిడుగు పడొచ్చనే వ్యాఖ్యలు చేశారని, పార్టీ మార్పు గురించి కాదని కొంతమంది అంటున్నారు.