నాన్నలు గల్ఫ్‌లో.. చెరువులో శవాలుగా కొడుకులు

by Nagaya |
నాన్నలు గల్ఫ్‌లో.. చెరువులో శవాలుగా కొడుకులు
X

దిశ, ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఆదివారం ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థుల పడి దుర్మరణం చెందిన సంఘటనతో జిల్లాలో విషాదం నెల కొన్నది. తుమ్మెనాల గ్రామంలో పాఠశాల పక్కనే ఉన్న చెరువులోకి ఉదయం 7.30 గంటలకు ఈతకని వెళ్లిన మారంపలి శరత్ (12), పబ్బం నవదీప్ (12), గోలుసుల యశ్వంత్ (13) చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. మృతులు శరత్, నవదీపులు అదే గ్రామానికి చెందిన వారు కాగా యశ్వంత్ నల్లగొండ జిల్లా దోసారం గ్రామానికి చెందినవారు. యశ్వంత్ కుటుంబ సభ్యులు బతువు దేరువు కోసం రెండు సంవత్సరాల క్రితం తుమ్మెనాల గ్రామానికి వచ్చారు. కాగా నరేష్ తండ్రి, నవదీప్ తండ్రి గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ధర్మపురి సీఐ బిల్లా కొటేశ్వర్ సంఘటన స్థలానికి వెళ్లి జాలర్లతో చెరువులో వెతికించారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story