- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: కండలేరు జలాశయంలో గల్లంతైన ముగ్గురు మృతి
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా రాపూరు కండలేరు జలాశయంలో గల్లంతైన వారు విగతజీవులుగా లభ్యమయ్యారు. గల్లంతైన ముగ్గురు మృతి చెందారు. మంగళవారం గల్లంతైన మృతదేహాలు బుధవారం ఉదయం వెలికితీశారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే చేజర్ల మండలం కొల్లపనాయుడు పల్లి గ్రామానికి చెందిన పొన్ను కుమార్, బోసు కుటుంబాలు మంగళవారం సాయంత్రం కండలేరు జలాశయం ని చూసేందుకు వెళ్లారు. అక్కడ వారికి ఈత కొట్టాలనే సరదా కలిగి, జలాశయంలోకి దిగడంతో పొరపాటున పొన్ను కుమార్ (36)ఆయన కుమార్తె పవిత్ర(6) బోసు కుమార్తె లక్ష్మి (11) గల్లంతయ్యారు.
సోదరులైన రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పొదలకూరు సీఐ సంగమేశ్వర రావు ఆధ్వర్యంలో కండలేరు డ్యామ్ ఎస్ఐ అనూష కేసు దర్యాప్తు చేస్తున్నారు. పొన్ను కుమార్, బోసు కుటుంబాలు తమిళనాడుకు చెందిన వారని అయితే పొట్టకూటి కోసం నెల్లూరు జిల్లా చేజర్లకు వలస వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.