టామ్ అండ్ జెర్రీ సెక్షన్స్.. ఐపీసీ సెక్షన్‌లు గుర్తుంచుకునేందుకు సింపుల్ టిప్స్

by Mahesh |   ( Updated:2022-05-04 10:55:30.0  )
టామ్ అండ్ జెర్రీ సెక్షన్స్.. ఐపీసీ సెక్షన్‌లు గుర్తుంచుకునేందుకు సింపుల్ టిప్స్
X

దిశ, ఫీచర్స్ : 'సైన్స్' సబ్జెక్ట్‌ను థియరీగా చెబితే ఏమాత్రం బుర్రకు ఎక్కదు. కానీ ప్రాక్టికల్‌గా ప్రయోగాలతో బోధిస్తే.. అంతకంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లేదేమో అనిపిస్తుంది. మ్యాథ్స్ కూడా అంతే! చిన్న ఫార్ములాను అర్థం చేసుకోగలిగితే.. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ను కూడా అవలీలగా చేయగలం. ఇదే విధంగా ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CrPc) వంటి సబ్జెక్ట్స్‌ను గుర్తుకుపెట్టుకోవడం కూడా కష్టమే. కానీ 'అపూర్వ శౌర్య' అనే ట్విట్టర్ యూజర్.. ఆ సెక్షన్స్‌ అన్నింటినీ సులభంగా గుర్తుంచుకునేందుకు ఐకానిక్ కార్టూన్ క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీ ని ఉపయోగించుకుంటున్నాడు.

ఐపీసీలోని వివిధ సెక్షన్స్‌ను జాబితా చేసిన శౌర్య.. అవి వ్యక్తులకు ఎలా వర్తిస్తాయో? టామ్ అండ్ జెర్రీ ద్వారా వివరించాడు. ఉదాహరణకు : సెక్షన్ 503 కింద నేరపూరితమైన బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టామ్(పిల్లి)పై జెర్రీ(ఎలుక) అభియోగాలు మోపవచ్చు. అంతేకాదు నిర్బంధించడం, హత్య ఉద్దేశంతో కిడ్నాప్ చేసినందుకు గాను సెక్షన్ 340, సెక్షన్ 364 కింద దావా వేయవచ్చు. మరి జెర్రీ ఊరికే ఉంటుందా! అల్లర్లు సృష్టినందుకు, దొంగిలిస్తునందుకు గాను జెర్రీ పై సెక్షన్ 378 కింద దొంగతనం కేసు పెట్టవచ్చు. తీవ్రమైన గాయం కలిగించినందుకు సెక్షన్ 320 కింద కూడా నేరారోపణ చేయవచ్చు. ఇలా కార్టూన్ క్యారెక్టర్స్‌తో అవగాహన కల్పిస్తున్న శౌర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed