- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాయిస్ వినిపిస్తే చాలు.. నచ్చిన కలర్‌కు రూపకల్పన!
దిశ, ఫీచర్స్ : 'సూర్యోదయం, సూర్యాస్తమయా'లు చూసేందుకు చాలామంది ప్రత్యేక వ్యూ పాయింట్స్‌కు వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం ఉన్నచోటు నుంచే ఆ అద్భుత దృశ్యాలను ఆస్వాదిస్తారు. ఇదిలా ఉంటే.. కాలాన్ని బట్టి ఆయా ఉషోదయ, సంధ్యా సమయాల్లో సూరీడి రంగుల్లో మార్పు కనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో సూర్యాస్తమయాన్ని ప్రతిబింబించే రంగునే ఇంటి గోడలకు వాడాలనుకుంటే మాత్రం చాలా కష్టమైన వ్యవహారం. ఇలా పెయింట్స్ ఉపయోగించి సరైన రంగు పొందేందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి. ఏ కలర్‌ను దేనిలో కలిపితే కోరుకున్న వర్ణం వస్తుందో తెలిసుండాలి. దీనికి పరిష్కారంగానే భవిష్యత్‌లో వాయిస్ ఉపయోగించి కావలసిన రంగుకు సంబంధించిన కచ్చితమైన టోన్‌ను పొందగలమని ప్రముఖ పెయింట్ బ్రాండ్ చెబుతోంది.
ప్రముఖ పెయింట్ బ్రాండ్ షెర్విన్-విలియమ్స్ కొత్తగా AI-ఆధారిత 'స్పీకింగ్ ఇన్ కలర్' యాప్ రూపొందించింది. ఇది ఖచ్చితమైన రంగును పొందేందుకు నిర్దిష్ట ప్రదేశాలు, వస్తువులు లేదా షేడ్స్ గురించి వాయిస్ మోడ్‌లో చెప్పేందుకు యూజర్లకు అనుమతించే సాధనం. ఉదాహరణకు రెడ్ మూన్ కలర్, చలికాలపు ఉషోదయపు భానుడి రంగు, అప్పుడే వికసించే బీరపువ్వు కలర్, తాజా ద్రాక్ష పండు ఇలాంటి వివరణలతో పాటు మరింత లోతైన ప్రాధాన్యతలతో కూడిన ఫొటోలు, ఇతర ఎంపికలతో కలర్ ప్యాలెట్‌ను పొందవచ్చు. Wunderman థాంప్సన్ అనే ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా.. ఇది థర్డ్-పార్టీ, యాజమాన్య కోడ్ రెండింటినీ ఉపయోగించి మీకు నచ్చిన రంగును కనుగొనేందుకు సహజ భాషను ఉపయోగించే రియాక్ట్ వెబ్ యాప్. ప్రపంచంలోని అతిపెద్ద కలర్ లైబ్రరీల్లో ఒకదాన్ని సృష్టించాని షెర్విన్ విలియమ్స్ ఆశిస్తోంది. అయితే ఇంకా వినియోగదారు వినియోగానికి సిద్ధంగా లేదు.