డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-10-29 02:52:04.0  )
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్(Vidya Balan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంటోంది. ఈ భామ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ భూలయ్యా త్రీ(Bhoolayya 3) లో మెరవనుంది. ఈ చిత్రంలో విద్యాబాలన్ మంజూలిక (Manjulika) రోల్‌లో నటించనుంది. అనీజ్ బజ్మీ(Anees Bazmee) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మాధురి దీక్షిత్, కార్తీక్ ఆర్యన్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ, అశ్విని కేల్కర్ సంజయ్ మిశ్రా వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే నటి విద్యాబాలన్ తాజాగా తన డైట్ ప్లాన్ గురించి అసలు విషయం బయటపెట్టింది. 45 ఏళ్లలో తను ఎలా వెయిట్ లాస్ అయ్యిందో చెప్పుకొచ్చింది.

‘‘బరువు ఉండడం వల్ల ఎన్నో అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. కొందరైతే నన్ను మహిళ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే ఉంటారా? లేక బరువు తగ్గుతారా? అని అన్నారని అవహేళన చేస్తే నేను చాలా బాధపడ్డానని వెల్లడించింది. కాగా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక న్యూట్రిషన్(Nutrition) ను కలిశానని తెలిపింది. ఆయన నా బాడీలో కొవ్వు లేదని చెప్పారని పేర్కొంది. ఆయన నా బాడీలో కొవ్వు లేదని చెప్పారని పేర్కొంది. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్(Inflammatory foods) లేని డైట్‌ని తీసుకోవాలని చెప్పారని వెల్లడించింది. నా బాడీకి పడని ఫుడ్స్ కు దూరంగా ఉన్నానని తెలిపింది. దీంతో ఆటోమేటిక్ బరువు తగ్గానని.. అలాగే నేను శాఖాహారిని అని తెలిపింది. గంటలకొద్ది వ్యాయామం అయితే ఎప్పుడూ చేయలేదని, కానీ బరువు ఎక్కువగా ఉండడం వల్ల అందరి మాటలతో నేను మానసికంగా కుంగిపోయానని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed