టైప్‌రైటర్‌తో బొమ్మలేస్తూ ఆశ్చరపరుస్తున్న యువకుడు!

by Manoj |
టైప్‌రైటర్‌తో బొమ్మలేస్తూ ఆశ్చరపరుస్తున్న యువకుడు!
X

దిశ, ఫీచర్స్ : 64 కళల్లో 'ఆర్ట్' ఒకటి. కుంచెతో వేసే ఆర్టిస్ట్‌లు కోకొల్లలుంటారు కానీ విభిన్నంగా ముక్కుతో, నోటితో, తలకిందులుగా వేసేవాళ్లూ ఉంటారు. కానీ లండన్‌కు చెందిన 25 ఏళ్ల కళాకారుడు జేమ్స్ కుక్‌ మాత్రం 'టైప్‌రైటర్'తో పెయింటింగ్స్ వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చేతితో పోర్ట్రెయిట్స్ గీసేందుకు ప్రయత్నించి విఫలమైన కుక్, టైపింగ్‌తో తనదైన శైలిలో బొమ్మలేస్తుండటం విశేషం.

లండన్‌లోని తన కార్యాలయంలో ఎటు చూసినా కనిపించే టైప్‌రైటర్‌ డ్రాయింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అతని కళాకృతుల్లో ప్రకృతి దృశ్యాలు, భవనాలు, జంతువులు సహా టామ్ హాంక్స్ వంటి ప్రముఖుల చిత్రాలెన్నో ఉంటాయి. ఈ కళాఖండాలను రూపొందించేందుకు అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలను వినియోగించే జేమ్స్..

1920కి చెందిన అమెరికన్ టైప్‌రైటర్ ఆర్టిస్ట్ పాల్ స్మిత్ నుంచి ప్రేరణ పొందినట్లు తెలిపాడు. 2014 నుంచి టైప్‌రైటర్ ఆర్ట్‌ను వేయడం ప్రారంభించానన్న జేమ్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించాలనేదే తన డ్రీమ్ అని చెప్తున్నాడు.

సవాళ్లు:

టైప్‌రైటర్ ఆర్ట్ చిత్రాలను A4 పేపర్‌పై పూర్తి చేసే కుక్, ఒక్కో డ్రాయింగ్‌కు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుందని పేర్కొన్నాడు. అతడు తన చిత్రాలను బహిరంగ ప్రదేశాల్లో పూర్తి చేసేందుకు ఇష్టపడతాడు. ఆయా పబ్లిక్ ప్లేసులో అతడు డ్రాయింగ్ మొదలుపెట్టే సమయంలో చూసేవాళ్లు ఆర్టికల్ టైప్ చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆర్ట్ వర్క్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతారని కుక్ తెలిపాడు. ఎసెక్స్‌లోని ఫిన్చింగ్‌ఫీల్డ్‌లో ఉన్న వోంకీ వీల్ గ్యాలరీలో యువ కళాకారుడు ఈ వేసవిలో జూలై 15 నుంచి ఆగస్టు 7 వరకు తన ఆర్ట్‌వర్క్స్ ప్రదర్శించనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed