- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer: క్రిస్మస్ కు రిలీజ్ అన్నారు.. సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయడమేంటి?.. దిల్ రాజు పై మండిపడుతున్న ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తున్నారు.మూడేళ్ళ కింద ఈ సినిమాను మొదలు పెట్టారు. ఈ మధ్యే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ను రెండు సార్లు మార్చారు. తాజాగా, మూవీ రిలీజ్ డేట్ మారడంతో దిల్ రాజు పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
దసరా సందర్భంగా 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా మొన్నటి వరకు క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని చెప్పి.. ఇప్పుడు సంక్రాంతికి గ్రాండుగా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. దీనిపై రియాక్ట్ అయినా దిల్ రాజు విశ్వంభర మా మూవీ కోసం వెనక్కి తగ్గింది. మేము చాలా ఆలోచించి సంక్రాంతికి అయితే మంచిదని ఇలా ప్లాన్ చేశామని తెలిపాడు. ఈ మూవీని క్రిస్మస్కు రిలీజ్ చేద్దామని చాలా ప్లాన్ చేసాం కానీ, వరల్డ్‌వైడ్‌గా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు క్రిస్మస్ కంటే సంక్రాంతికి బాగుంటుందని నాతో పాటు నా డిస్టిబూటర్స్ కూడా ఈ నిర్ణయానికి మద్ధతుగా నిలిచారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కానీ, ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.