- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఈ ఐదారు రోజులు నాకు క్రాష్ కోర్సులా అనిపించింది’.. స్టార్ హీరోపై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (పోస్ట్)
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా సినీ లవర్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఓ ఐటెం సాంగ్‌లో మెరవబోతున్నారు. ‘కిస్సిక్’ అంటూ సాగే పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా రీసెంట్‌గా ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు శ్రీలీల. ఈ మేరకు అల్లు అర్జున్ ఈ భామకు సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు.
అయితే ఈ గిఫ్ట్ తీసుకున్న శ్రీలీల ఐకాన్ స్టార్‌ను పొగుడుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘ టు బన్నీ సర్.. ప్రేమ గౌరవంతో ఈ నోట్ మీకు పంపిస్తున్నాను. మీతో వర్క్ చేయడం నాకెంతో అందమైన అనుభూతిని పంచింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు. నిజం చెబుతున్నా ఈ ఐదారు రోజులు నాకు ఒక క్రాష్ కోర్సులా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమాభినందనలు’ అంటూ రాసుకొచ్చింది. అలాగే ‘తగ్గేదేలే’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘వైల్డ్ ఫైర్’ వంటి హ్యాష్ ట్యాగ్స్‌ను కూడా జత చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘థ్యాంక్యూ మై డియర్. మీ మాటలు నా మనసును తాకాయి. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి’ అని బన్నీ తెలుపుతూ శ్రీ లీలను డ్యాన్సింగ్ క్వీన్ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.