పరిగడుపున నీరు తాగితే ఎన్ని లాభాలో..

by GSrikanth |
పరిగడుపున నీరు తాగితే ఎన్ని లాభాలో..
X

దిశ, ఫీచర్స్: పరిగడుపున నీరు తాగితే బోలేడు లాభాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. నిద్ర లేచిన వెంటనే నీరు తాగడం ద్వారా చర్మం, జీర్ణవ్యవస్థకు లాభం చేకూరుతుందని చెప్తున్నారు. దీని వల్ల మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాం.

* పరగడుపున ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడటంతో పాటు, పోషకాలను గ్రహించేందుకు దోహదమవుతుంది. అలాగే కొత్త రక్తం తయారీ, కండర కణాల వృద్ధికి అవకాశం ఉంటుంది. రక్త కణాల శుద్ధి జరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు.

*పొద్దున్నే నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువును కలిగి ఉన్న వారు సులభంగా వెయిట్ లాస్ కావచ్చు. మెదడు చురుగ్గా పని చేస్తుంది.

* చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

*పేగు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఉదర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతాయి.

* ఖాళీ కడుపుతో బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం ఉంటే ఉదయాన్నే నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

* కీళ్ల నొప్పులకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

* నోటి దుర్వాసన సమస్యలు తొలగిపోతాయి.

* ఉదయం సమయంలో చాలా మందిలో కనిపించే పార్శ్వపు కడుపు నొప్పి వంటి వాటిని నివారిస్తుంది.

* మధుమేహం ఉన్నవారు, ఉదయన్నే గ్లాస్ వాటర్‌లో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల , రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది.

* ఉదయం సమయంలో నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు.

Advertisement

Next Story