- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్!
దిశ, మేడిపల్లి: తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజులుగా మేడిపల్లి పీఎస్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ శంకర్ నగర్ లో నివాసం ఉంటున్న ఎస్. సాగర్ రెడ్డి గురువారం సాయంత్రం సమయంలో పనిమీద బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో బీరువాలోని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. బీరువాలో ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు, 3 తులాల వెండి ఆభరణాలు, ఒక సెల్ ఫోన్, 25 వేల రూపాయలు నగదు చోరీకి గురైనట్లు గుర్తుంచాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మేడిపల్లి పోలీసులు క్లూస్ టీమ్‌తో వచ్చి ఆదారాలు సేకరించారు. చుట్టూ పక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాల ఆధారంగా చోరీకి పాల్పడిన వారి కోసం దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.