- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి నిర్లక్ష్యానికి యువకుడు బలి.. కరెంట్ షాక్ తగిలి పోల్ పైనే..
దిశ, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో యాచారం కృష్ణ గౌడ్ (26) అనే యువకుడు కరెంట్ కలెక్షన్ సరిచేయడానికి కరెంట్ పోల్ ఎక్కగా ఇంకో ఫెడర్ నుండి కరెంట్ సప్లై రావడం తో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన యాచారం కృష్ణ గౌడ్ గత కొంత కాలంగా చింతపల్లి మండల కేంద్రంలో కరెంటు మీటర్ రీడింగ్ బిల్లు కొడుతూ.. కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. శనివారం చింతపల్లి మండలం లైన్ మెన్ కరెంట్ పని ఉందని అతడిని తన ఇంటి వద్ద నుండి తీసుకొని పోయి కరెంట్ పోల్ పైన ఉన్న వైర్లను సరిచేయాలని చెప్పగా కృష్ణ గౌడ్ ఫైలుపై వైర్లను సరి చేస్తున్నాడు. ఇంతలో ఇంకో వైపు నుంచి వచ్చే ఫిడర్ బంద్ చేయకపోవడంతో అతను కరెంట్ షాక్ కు గురై పోల్ పై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతునికి సంవత్సరం క్రితం పెళ్లి కాగా తన భార్య నిండు గర్భవతి. ఐదుగురు సంతానం లో నలుగురు అక్కల తర్వాత కృష్ణ ఐదోవ సంతానం. అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు ఇలా చనిపోవడంతో తల్లి, తన భర్తను విగతజీవిగా చూస్తూ.. భార్య సంధ్య రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ గౌడ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారిని సస్పెండ్ చేసి మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ -నాగార్జున సాగర్ హైవే పై బైఠాయించి ధర్నా కు దిగారు. మృతుని పెద్దనాన్న యాచారం సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి తెలిపారు.