- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలానికి వెళ్లిన భార్యాభర్తలు.. అంతలోనే భర్తకు వాంతులు.. అనుమానం వచ్చి నిలదీయగా..
దిశ, నర్వ : నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని యాంకీ గ్రామానికి చెందిన ఉప్పరి నరేష్(23) తన భార్య ఇచ్చిన కోటర్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి అన్న శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్‌కు 4 నెలల క్రితం మల్దకల్ల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన నవిత అలియాస్ పల్లవితో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి సంసారం ఇష్టం లేనట్టుగా పల్లవి రెండు మూడు రోజులకు ఒకసారి తల్లిగారింటికి వెళ్ళిపోయేది. ఒక రోజు పల్లవి వాళ్ళ తండ్రి సూరిబాబు, తాత ఇంటికొచ్చి వీరి సంసార విషయం గురించి మాట్లాడుకున్నారు.
వాళ్లు వెళ్లిపోయిన మరుసటిరోజు నరేష్, పల్లవి బయటికి వెళ్లారు. మళ్లీ 11 గంటలకు నరేష్ ఇంటికి రాగానే వాంతులు చేసుకోవడంతో అనుమానం వచ్చి మా తమ్ముడిని నిలదీయగా పొలం దగ్గరికి పోయి భార్య ఇచ్చిన కోటర్ మందు తాగినట్టు చెప్పాడు. తన భార్య కూడా ఇంటికి రాకపోవడంతో ఆ మందులో ఏదో కలిపారని ఊహించి నరేష్‌ను ఆత్మకూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసుకుని మళ్లీ గ్రామానికి తిరిగి రాగా 2 రోజుల తర్వాత గొంతు నొప్పితో మాట్లాడలేని స్థితిలో ఉండగా గత నెల 23న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. వెంటనే నర్వ మండల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధుమోహన్‌కు నరేష్ చెప్పిన విధంగా అతని అన్నయ్య ఫిర్యాదు చేశాడు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.