- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పగబట్టిన దున్నపోతు.. ఆ వ్యక్తిని ఎలా చంపిందంటే..
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని పదర మండలం లో ఒక రైతు అనుమానాస్పదంగా తన వ్యవసాయ పొలంలో ఆదివారం మృతి చెందాడు. ఈ ప్రమాదం పై గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రైతు ఏడ్పుల బాలయ్య (45) గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలంలో పశుగ్రాసం కోసం తన వ్యవసాయ పొలంలో జొన్న చొప్ప వేశారు. ఊరు మీద ఉన్న దున్నపోతు తరచూ మేత కోసం పొలానికి వెళ్లిన క్రమంలో రైతు బాలయ్య దానిని తరిమే వాడని, ఈ నేపథ్యంలో అతనిపై పగ పెంచుకున్న దున్నపోతు ఆదివారం మధ్యాహ్న సమయంలో కూడా పొలంలో ఉన్నదని తెలిపారు.
ఆ రైతు దున్నపోతును అక్కడి నుంచి తరిమే క్రమంలో అది ఎదురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి కొమ్ములతో పొడిచి చంపినట్లు గ్రామస్తులు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహానికి సమీపంలో ఒక ఇనుప రాడ్డు, చినిగిన చొక్కా, పంచే పడి ఉన్నాయని తెలిపారు. దున్నపోతు కొమ్ములతో పొడిచి కొంత దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఆదిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.