- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొరం మాఫియా కక్కుర్తికి నిండు ప్రాణం బలి..
దిశ, బాల్కొండ: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి, మొరం మాఫియా కక్కుర్తికి ఓ నిండు ప్రాణం బలైంది.మొరం తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఉదయం చనిపోయిన గంటలు గడిచిన గానీ, కనీసం సంబంధిత మొరం మాఫియా కన్నెత్తి చూడలేదు. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలలోకి వెళితే.. ముప్కాల్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళలో ఎస్సారెస్పీ జీరో పాయింట్, వరద కాలువ సమీపం నుండి అక్రమంగా మొరం తరలిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వేళలో అక్రమంగా మొరం తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ముప్కాల్‌కు చెందిన బోదాసు గంగాధర్ అనే (20 ) యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేసే వరకు ఘటన స్థలం నుండి మృతదేహాన్ని తీయమని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దీనితో ట్రాక్టర్ యజమాని మృతుని కుటుంబానికి 8లక్షల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్కాల్ ఎస్సై గోపీ తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అక్రమ రవాణా అరికట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.