- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nani-Srikanth Odela: సినిమాకు టైటిల్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
దిశ, సినిమా: న్యాచురల్ స్టార్ నాని(Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల దసరా(Dasara), సరిపోదా శనివారం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విషయం తెలిసిందే. అదే ఫామ్‌తో ప్రజెంట్ శ్రీకాంత్ ఓదెలతో ‘నాని ఓదెల-2’(Nani Odela-2) అనే వర్కింగ్ టైటిల్ పెట్టి మూవీ చేస్తున్నారు. అయితే దీనిని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో దసరా ఫేం సుధాకర్ చేరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కానీ ఇందుకు సంబంధించిన అప్డేట్స్(Updates) విడుదల కాలేదు. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ నాని(Nani) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు. ‘నాని ఓదెల-2’(Nani Odela-2) సినిమాకు ‘ది ప్యారడైజ్’(The Paradise) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో డిజైన్ చేసిన టైటిల్ లుక్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. అలాగే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ మూవీ 2025లో గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు సమాచారం. ఇంకా ఇందులో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబోలో వచ్చిన ‘దసరా’(Dasara) ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవడంతో ‘ది ప్యారడైజ్’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.