- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. 'కీలక అంశం'పై నిర్ణయం!
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది రోజుల పాటు ఢిల్లీ పర్యటనను ముగించుకుని సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వడ్ల కొనుగోళ్ళపై ఈ సమావేశంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. కేంద్ర వైఖరికి నిరసనగా తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపైనా చర్చించనున్నట్లు సమాచారం. వడ్ల కొనుగోళ్ళపై ఢిల్లీ నిరసన దీక్ష వేదికగా కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధించిన తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొన్నది.
కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం వడ్ల సేకరణపై క్లారిటీ ఇచ్చింది. ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదని, నిబంధనలకు విరుద్ధంగా కొనబోమని, పారా బాయిల్డ్ రైస్‌ను ఇవ్వబోమంటూ తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగానే హామీ ఇచ్చిందని స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ళపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. గతేడాది అక్టోబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఉండవంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు రాష్ట్ర రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రాథమిక సమాచారం. కేబినెట్ సమావేశంలోనే దానిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్లు సచివాలయ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
ఒకవేళ ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనాల్సి వస్తే మొత్తం దిగుబడి ఎంత ఉందో జిల్లాల వారీగా గణాంకాలను తెలుసుకుని ఆ ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి సీఎంఓ అధికారులు వివరాలు కోరినట్లు తెలిసింది. పౌర సరఫరాల శాఖ నుంచి గోదాముల్లో ఇప్పటికీ నిల్వ ఉన్న ఖరీఫ్ బియ్యం వివరాలను కూడా సీఎంఓ సేకరిస్తున్నది. వీటన్నింటిని కేబినెట్‌లో లోతుగా చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలను కూడా రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులను కేబినెట్ ఆదేశించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే మీడియా సమావేశం ద్వారా వెల్లడించనున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
ఎజెండాలో లేని 'కీలక' అంశంపైనా చర్చ
ప్రస్తుతానికి వడ్ల కొనుగోలు సమస్యపైనే కేబినెట్ పూర్తిస్థాయి దృష్టి సారించనున్నా ఎజెండాలో లేని ఒక 'కీలక' అంశంపైన కూడా సీఎం చర్చించే అవకాశం ఉన్నది. ఆ 'కీలక' అంశం ఏమిటనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వడ్ల కొనుగోలు అంశంతో పాటు కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాజకీయ సంబంధమైనదిగా కూడా ఉంటుందనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రంతో అమీతుమీ అనే స్థాయిలో కేసీఆర్ స్పష్టమైన వైఖరిని తీసుకున్నందున కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించి తీసుకోబోయే సంచలన నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలో నిశితంగా ఆలోచించిన తర్వాత తీసుకోబోయే ఈ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారింది.