- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer: నేడు 11 థియేటర్లలో విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' టీజర్
దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ చేంజర్' ( Game Changer ) ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుంటున్న ఈ సినిమా..జనవరి 10న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే, నేడు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంత వరకు ఏ సినిమాకి లేని విధంగా మూడు రాష్ట్రాల్లో ఈ టీజర్ లాంచ్ చేయబోతున్నారు.
లక్నోలోని ప్రతిభ థియేటర్ లో సాయంత్రం 04:30 లకు 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ మొదలుపెట్టి మరో రెండు రాష్ట్రాల్లో మొత్తం 11 థియేటర్లలో సెలెబ్రేషన్స్ షురూ చేయన్నునారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, ఖమ్మం, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, ప్రాంతాల్లో లాంచ్ ఉండబోతుండగా.. కర్ణాటకలో బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో, లక్నోలోని ప్రతిభ థియేటర్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, ప్రియదర్శి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.