నగరంలో చేతబడి కలకలం.. నిద్రలేచే సరికే అంతా అయిపోయింది..

by Manoj |
నగరంలో చేతబడి కలకలం.. నిద్రలేచే సరికే అంతా అయిపోయింది..
X

దిశ, వెబ్ డెస్క్: మానవుడు ఆధునికత వైపు పరుగులు తీస్తున్నప్పటికీ అనేక మూఢనమ్మకాలు వెనక్కు లాగుతూనే ఉన్నాయి. వాటిలో చేతబడులు కూడా ఒకటి. చదువులు సమాజాన్ని మారుస్తాయని ఎందరో పెద్దమనుషులు చెప్పారు. కానీ ఇప్పటికీ చదువుకున్నవారు సైతం మూఢనమ్మకాల బారిన పడుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పిన మానవుని మది నుంచి ఈ మూఢనమ్మకాలు తొలగడం లేదు. ముఖ్యంగా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కనిపించిందంటే అది కచ్చితంగా చేతబడే అని భావిస్తున్నారు.

తాజాగా ఇటువంటి సంఘటనే మదనపల్లిలో జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటివద్ద చేతబడి చేసి భయాందోళనకు గురిచేస్తున్నారని ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కోటవీధికి చెందిన మురళి ఇంటి ముందు చేతబడి చేయడంతో కుటుంబమంతా ఆందోళనకు గురయ్యారు. ఉదయం నిద్ర లేవగానే ఇంటి ముందు నిమ్మకాయలు, నాలుగు కోడిగుడ్లు, దుస్తులతో తయారు చేసి.. మేకులు కొట్టి ఉన్న బొమ్మ, మట్టికుండ, కుంకుమ చల్లి గడప ముందు పెట్టారు. దీంతో కుటుంబీకులు భయపడి బయటకు రాలేదు. ఆ తర్వాత మున్సిపాలీటి సిబ్బందితో వాటిని తొలగించారు. కాగా ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులు కోరింది.

Next Story

Most Viewed