కర్ణాటక అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ క్లారిటీ

by GSrikanth |
కర్ణాటక అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి్స్తున్న చిత్రం ట్రిపులార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కర్ణాటక సినీ అభిమానులు ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కన్నడ బాషలో పెద్ద ఎత్తున రిలీజ్ కావడం లేదని.. తెలుగుతోపాటు.. తమిళ్, హిందీ భాషల్లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని కన్నడ వర్షన్ తక్కువగా విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది తమను అవమానించడమే అంటూ 'BoycottRRRinKarnataka' అనే హ్యాష్‏ట్యాగ్‏ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో కన్నడ అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. "రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పేందుకు ఎంతగానో కృషి చేశారు. మీరు కన్నడలో సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారని మేము అర్థం చేసుకోగలము.. ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్‌ను ప్లే చేయడానికి ఇష్టపడని థియేటర్ యాజమానులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. కన్నడ వెర్షన్‌ను రేపటిలోగా అన్ని స్క్రీన్‌లలోకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నాము" అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story