బీసీల శక్తి ఒక చారిత్రాత్మకమైంది: బీసీ హక్కుల సాధన సమితి

by Mahesh |
బీసీల శక్తి ఒక చారిత్రాత్మకమైంది: బీసీ హక్కుల సాధన సమితి
X

దిశ, తుంగతుర్తి: రాష్ట్రంలో బీసీలకు ఉన్న శక్తి, యుక్తి, పటుత్వం ఒక చారిత్రాత్మక మైనదని బీసీహక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగ చారి పునరుద్ఘాటించారు. మండల కేంద్రమైన తుంగతుర్తిలో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ, రాష్ట్రాల్లో సంపద సృష్టించాలన్న, ప్రళయాన్ని రగిలించాన్న బీసీలకే సాధ్యమని స్పష్టం చేశారు. అనాది కాలం నుండి బీసీలు ఎంతో సంపద సృష్టిస్తున్నప్పటికీ వివిధ రంగాలలో మాత్రం అణగదొక్కబతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ ల మధ్య పాలకులు చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు వీటిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఎండగట్టడంలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడున్నర దశాబ్దాల కాలం నుండి రాజ్యాధికారానికి దూరమవుతున్న బీసీలంతా ఏకమై పాలకుల కుట్రలను తిప్పికొట్టాలని వారు కోరారు. దేశంలో కుక్కలకు, నక్కలకు, పశువుల కు, పక్షులు, మేకలకు ఉన్న లెక్కలు బీసీలకు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ గణన పై ప్రభుత్వం కుంటి సాకులు చెప్పకుండా వారి లెక్కలు ఖచ్చితంగా తేల్చాలని డిమాండ్ చేశారు. దేశ, రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు వివిధ రంగాల పరంగా ఉన్న రిజర్వేషన్లు బీసీలకు వచ్చేసరికి పాలకులు మొండిచేయి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.

50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని ఆయన కోరారు. మాజీ జడ్పీటీసీ మురగుండ్ల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ ధూళిపాళ్ల ధనుంజయ గౌడ్, ఉమ్మడి జిల్లా రైతు సంఘం నాయకులు ఎల్లంల యాదగిరి, గీత పనివారల సంఘం జిల్లా నాయకులు తోట్ల ప్రభాకర్, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు ఎల్ల బోయిన బిక్షం, పెద్ద బోయిన అజయ్, కోల సతీష్, హజారీ శ్రీనివాస్, తోట యాదగిరి, కొడవటిగంటి వెంకన్న, భూతం లింగమల్లు, తిపిరాల శ్రీకాంత్, ఆకుతోట సోమన్న, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed